గోపాలపురం: రాష్ట్రంలో గర్భిణీలు చిన్నపిల్లలు ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని టీడీపీ రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ అన్నారు. సోమవారం రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో పౌష్టిక మాసోత్సవం సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.