ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. భవిష్యత్తులో వరద నీరు ఇళ్లలోకి చేరకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సంగారెడ్డిలో ముంపు కాలనీలను పరిశీలించిన అనంతరం మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులు పాల్గొన్నారు