మోరంపూడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
NEWS Sep 09,2024 02:55 pm
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడి వద్ద ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.