ఏలేరు ప్రాజెక్టులో వరద నీరు పొంగి ప్రవహించడంతో అధికారులు సోమవారం ఐదో గేటును కూడా ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఇప్పటికే 4 గేట్ల ద్వారా వరద దిగువకు ప్రవహిస్తూ అనేక చోట్ల ఏటిగట్లకు గండ్లు పెడుతూ గ్రామాలను పంట పొలాలను ముంచెత్తుతోంది. ఇప్పుడు అధికారులు ఐదో గేటును కూడా ఎత్తివేయడంతో వరద ప్రవాహం అధికమైంది. పరివాహక ప్రాంత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.