ప్రజావాణి కార్యక్రమంలో 97దరఖాస్తులు
NEWS Sep 09,2024 02:56 pm
సిరిసిల్ల: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలు, వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. మొత్తం 97 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.