ప్రమాదకర స్థితిలో బ్రిడ్జ్
NEWS Sep 09,2024 02:58 pm
ఏలేశ్వరం- అప్పన్నపాలెం మధ్య ఉన్న వంతెనకు వరద తాకిడి అధికమైంది. ఏలేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జ్ ఏ సమయాన తెగిపడుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తడంతో ఇప్పటికే అధికారులు గేట్లు ఎత్తి 18,775 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కుంగిన బ్రిడ్జిపై నుంచి ఏలేరు కాలువ ప్రవహిస్తుంది.