భారతదేశానికి ఒకే భావజాలం ఉందని ఆరెస్సెస్ భావిస్తుందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ నేతకు భారత్‌ను అవమానించడం అలవాటు ఐపోయిందని దుయ్యబట్టింది. చైనాతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆయన అలా మాట్లాడుతున్నారని విమర్శించింది. సామాజిక ఉద్రిక్తతలను సృష్టించడానికే దేశాన్ని విభజించి పాలించాలని రాహుల్ భావిస్తుంటారని ఘాటుగా వ్యాఖ్యానించింది.