జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో భారత్ పెట్రోల్ బంక్ ఎదుట జాతీయ రహదారిపై సోమవారం బైక్‌ను కారు ఢీకొట్టింది. కారు ఆగకుండా వెళ్ళిపోయింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ధర్మవరానికి చెందిన అమరపులి సూరిబాబుకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై జగ్గంపేట పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు హైవే మొబైల్ పోలీసులు తెలిపారు.