తెలుగు భాషపై రాహుల్ కామెంట్
NEWS Sep 09,2024 10:38 am
డాలస్: తెలుగు భాషపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా పర్యటనలో రాహుల్.. ఎన్నారైలతో మీట్ అయ్యారు. తెలుగు భాషలో చరిత్ర, సంస్కృతి ఉన్నాయన్నారు. హిందీ భాషను తెలుగు రాష్ట్రాలపై రుద్దారని చెప్పారు. తెలుగు భాష ముఖ్యం కాదంటే.. ఆ ప్రాంత ప్రజలను అవమానించడమేనని అన్నారు. దేశానికి ఒకే భావాజాలం ఉందని ఆర్ఎస్ఎస్ భావిస్తుందని, తాము మాత్రం భిన్న భావజాల కేంద్రమని భావిస్తామని అన్నారు.