ఆమె ఫొటోలు ఎక్కడా కనిపించకూడదు
కోల్‌కతా డాక్టర్ కేసులో సుప్రీం ఆదేశాలు
NEWS Sep 09,2024 10:26 am
కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన కేసులో సీబీఐకి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 17న కొత్త నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. మరోవైపు వైద్యురాలికి సంబంధించిన ఫొటోలు, దృశ్యాలను అన్ని సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కోల్‌కతా పోలీసులు ఎందుకు ఆలస్యం చేశారని మరోసారి ప్రశ్నించింది.