జగదేవ్ పూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అధిక వర్షాలతో దెబ్బతిన్న పర్తి పంటలను జిల్లా వ్యసాయాధికారి రాధిక పరిశీలించారు. నల్లరేగడి భూముల్లో పత్తి పంటలో నీరు నిలిచి వేర్లకు గాలి అందక మొక్కలు వాడిపోవడం జరుగుతుందన్నారు. వీలైనంత త్వరగా రైతులు చేలలో నిలిచిన నీటిని కాల్వల ద్వారా బయటికి పంపించాలన్నారు. అధిక వర్షాలకు తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.