పురపాలక సంఘ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ ముఖ్యఅతిథిగా పాల్గొని కాళోజి చిత్రపటానికి పూలమా వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిందం కళ మాట్లాడుతూ దివంగత ప్రజాకవి కాళోజీ స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణవాది, గొప్ప కవి తన కవితల ద్వారా ఎంతోమందిలో చైతన్యాన్ని కలుగజేశారు. నిజాం కాలంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించారు. తన కవితల ద్వారా ఎంతోమందికి మార్గదర్శకుడు అయ్యారని చెప్పారు.