KMR: కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కాళోజి నారాయణ రావు జయంతిని నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ కాళోజి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నిరంకుశ పాలనపై కలం ఎక్కు పెట్టిన ప్రజా కవి అని కొనియాడారు. మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.