రాబోయే తరానికి స్ఫూర్తి కాళోజి
NEWS Sep 09,2024 09:56 am
కాళోజీ నారాయణరావు రచనలు ప్రస్తుత తరానికి, భవిష్యత్తు తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లాకలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కాళోజి జయంతి వేడుకలను కలెక్టరేట్ లో నిర్వహించారు. కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడారు. రచనల ద్వారా ప్రజా చైతన్యంలో కీలకపాత్ర పోషించిన కాళోజీ చిరస్మరణీయులని అన్నారు. కాళోజి రచనలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయని, అన్యాయంపై పోరాడేలా చేస్తాయని తెలిపారు.