వరదల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలో నీట మునిగిన రెవెన్యూ కాలనీలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పర్యటించారు. అధిక వర్షాల వలన కాలనీలోని 130 ఇళ్లలోకి నీరు చేరిందన్నారు. చంద్రయ్య కుంటకు ఓపెన్ డ్రైవ్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి స్థానికులకు హామీ ఇచ్చారు