అత్యవసర పశువైద్య సేవలు
NEWS Sep 09,2024 09:57 am
అరకులోయ మండలం లోతేరు, మాడగడ పంచాయితీ పరిదిలో పశుసంవర్ధక శాఖ డా. శీనయ్యా ఆదేశాలతో అత్యవసర పశువైద్య సేవలను అందించారు. నిరంతర వర్షాల వలన పశువులు, గొర్రెలు, మేకలు వ్యాధుల బారీన పడకుండా నట్టల నివారణకు మందులు, గాలికుంటు వ్యాధికి టీకాలు వేసినట్లు పశుసంవర్ధక శాఖ సహాయకులు ధర్మా తెలిపారు. పశు యాజమాన్య పద్దతులు, పశుభీమా, గోశాలల గురించి రైతులకు వివరించినట్లు లైవ్ స్టాక్ ఆఫీసర్ సాంబశివరావు తెలిపారు.