ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ ప్రారంభం
NEWS Sep 09,2024 10:01 am
ఓపెన్ డిగ్రీ 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు జోగిపేట నెహ్రూ మెమోరియల్ డిగ్రీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్, కోఆర్డినేటర్ గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డా. బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నందు మొదటి సంవత్సరం అడ్మిషన్ల కొరకు ఇంటర్, ఐటిఐ, పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు అర్హులన్నారు. చివరి తేదీ ఈ నెల 29వ తేదీ అని పూర్తి వివరాలకు 7382929780, 9494875790 ఈ నెంబర్లకు సంప్రదించాలన్నారు.