వేములవాడ రాజన్నను దర్శించుకున్న
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
NEWS Sep 09,2024 10:02 am
ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేములవాడలో రాజన్న కోడె ముక్కు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు శాలువాతో సత్కరించి లడ్డు ప్రసాదం అందజేశారు.