మహేష్ గౌడ్ ను కలిసిన శ్రీనివాస్ రెడ్డి
NEWS Sep 09,2024 09:57 am
టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ను దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మహేష్ కుమార్ గౌడ్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణ, సుప్రభాత రావు, డిసిసి అధ్యక్షులు తూముకుంట నరసారెడ్డి, చెరుకు విజయ్ రెడ్డి, వెంగళరావు, సోలిపేట ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు,