న్యాల్ కల్ మండలం అమ్రాబాద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 3 రోజుల క్రితం సౌట వాగు దాటే సమయంలో కొట్టుకుపోయి మృతి చెందిన విషయం తెలిసిందే. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ కలెక్టర్ తో మాట్లాడి తక్షణమే మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. దాంతో ఈరోజు తహసిల్దార్ భూపాల్ బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చెక్కు అందజేశారు.