అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని మారుమూల పినకోటలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు, పెద గెడ్డ ఉగ్ర రూపంతో ఉదృతంగా ప్రవహిస్తున్న గిరిజన రైతులు తాడు సహాయంతో పంట పొలాలను చూసుకునేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాగును దాటుతున్న పరిస్థితి. ఈ వాగు అవతల సుమారుగా వందకు పైగా గిరిజన కుటుంబాలు కొండపోడు, వరి పంటలు జీడిమామిడి, కొబ్బరి, మామిడి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.