మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రదేశాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ చెన్నమనేని శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు