డుంబ్రిగూడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
NEWS Sep 09,2024 10:12 am
భారీ తుపాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డుంబ్రిగూడ తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తహసీల్దార్ నాగమ్మ తెలిపారు. తుపాను ప్రభావం వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలను ఎవరూ దాటే సాహసం చేయవద్దన్నారు. పంచాయతీల వారీగా వీఆర్ఎలను, రెవెన్యూ సిబ్బందిని, వైద్య సిబ్బందిని అప్రమత్తంగా చేశామన్నారు. పంట, గృహా నష్టలు, ఆస్తి, ప్రాణ నష్టం జరిగితే ఆస్ఐ హరిను సంప్రదించాలని ఆమె కోరారు.