పెదబయలు మండలం డెట్రాయిట్పుట్టు గ్రామానికి చెందిన కొర్ర పుష్ప అనే గర్భిణీకి 2 రోజులుగా పురిటి నొప్పులు వస్తున్నా వరద కారణంగా ఆసుపత్రికి తరలించలేని పరిస్థితి నెలకొంది. సోమవారం ఆశావర్కర్ సాయంతో గ్రామ సమీపంలో వాగు వరకు వచ్చారు. వాగు దాటేందుకు ప్రయత్నించగా.. ఉద్దృతంగా ప్రవహించడంతో సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్న హృదయవిదారక పరిస్థితి నెలకొంది.