పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్
NEWS Sep 09,2024 06:10 am
TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల గడువులోగా చర్యలు తీసుకోకపోతే.. సుమోటోగా తీసుకుంటామని పేర్కొంది.