ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న
జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్
NEWS Sep 09,2024 05:36 am
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుని వద్ద లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో 3వ రోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ సమాజంతో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్ వినాయక కమిటీ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ను సన్మానించి మెమోంటో అందజేసింది.