ఇన్‌స్టాలో పరిచయమైన భైంసా విద్యార్థినిని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణ చైతన్య 20 రోజుల పాటు హోటల్ రూంలో బంధించి లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కృష్ణ చైతన్య.. ఆమెను హైదరాబాద్ కి వచ్చేలా ఒప్పించి 20 రోజులుగా లైంగికంగా వేధించాడు. చివరికి పరారు అయ్యాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నారాయణగూడ పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు.