ఎమ్మెల్యే హరీష్ రావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. మేడ్చల్ లో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రైతులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. రైతు రుణమాఫీపై హరీష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు ఎంపీ. రైతు సురేందర్ రెడ్డి కుటుంబంలో ఆయన తల్లికి ఇప్పటికే రూ. లక్ష రుణమాఫీ జరిగిందని స్పష్టం చేశారు.