KMR: రాజంపేట మండల కేంద్రంలో హిందు దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెండి గణనాథుడు చూపరులను ఆకట్టుకుంటుంది. వెండితో చేసిన గణనాథుని చూడడానికి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ సందర్బంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ఏటా వివిధ రూపాల్లో ఉండే గణపతిని ప్రతిష్టిస్తామన్నారు.