హవెలి ఘనపూర్ మండలం రాజ్ పేట గ్రామానికి చెందిన దాసరి పోచయ్య (60) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామ పంచాయతీ స్వీపర్ గా పనిచేస్తున్న పోచయ్య ఈరోజు ఉదయం 6.30 గంటలకు గణేష్ మండపం వద్ద పూడుస్తున్నాడు. అక్కడున్న కరెంట్ వైర్లు పక్కనపెట్టి ఊడ్చడానికి ప్రయత్నించగా కరెంటు షాక్ తో మృతి చెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు.