KMR: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రతి సంవత్సరం నియోజకవర్గం మొత్తం లడ్డులను పంపిణి చేస్తారు. భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ప్రతిష్టించిన వినాయక మండపాలకు వెళ్లి స్థానిక బీజేపీ నాయకులు లడ్డును ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ అధ్యక్షులు శంకర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.