అరకు- విశాఖపట్నం బస్సులు రద్దు
NEWS Sep 09,2024 05:01 am
అరకు లోయ- విశాఖపట్నం మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను సోమవారం పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరకు- విశాఖ ఘాట్రోడ్లో కొండ చరియలు జారు తుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఘాట్రోడ్డు బాగా దెబ్బతింది. మట్టి, రాళ్లు రహదారి పైకి ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బస్సు సర్వీసులు రద్దు చేశారు.