మారేడుమిల్లి: మారేడుమిల్లి మండలంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మారేడుమిల్లి నుంచి బొడ్లంక వెళ్లే గ్రామాల మధ్య పెండ్లి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగు అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తుందని, ప్రజలు ఎవరూ వాగును దాటవద్దని అధికారులు హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కాలువల జోరుగా ప్రవహిస్తున్నాయి.