తూ.గో. జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
NEWS Sep 09,2024 05:02 am
తూర్పుగోదావరి జిల్లాకు భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సెలవును జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో అమలు చేయాలని ఆమె సూచించారు. మరోవైపు కాకినాడ జిల్లాలో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.