ఈ నెల 11వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నట్లు తూ.గో. జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆదివారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా ఇసుక సమన్వయ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాలో కొత్తగా డీసిల్టేషన్‌కు తొమ్మిది పాయింట్లు గుర్తించామన్నారు. కాగా ఉచిత ఇసుక సక్రమంగా అమలుచేయడానికి గట్టి నిఘా పెట్టామని చెప్పారు.