ఆంధ్రా క్రికెట్ సంఘ కార్యదర్శిగా కాకినాడకు చెందిన సానా సతీష్ బాబు ఎన్నికయ్యారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఏసీఏ ప్రతినిధులు ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారన్నారు. ఈ సందర్భంగా సతీష్ బాబు మాట్లాడుతూ.. క్రీడలపై తనకున్న మక్కువతో ఈ అత్యున్నత హోదాను అందిపుచ్చుకున్నానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నైపుణ్యం ఉన్న క్రికెట్ క్రీడాకారులను వెలికి తీసి ప్రోత్సహిస్తామని తెలిపారు.