కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన దినేష్ (43) ఈ నెల 4న ఆత్మహత్యాయత్నం చేసుకోగా ఆసుపత్రిలో చేర్పించారు. ఇక కిర్లంపూడి మండలం గోనాడకు చెందిన చిన్న (48) ఈ నెల 6న రోడ్డు ప్రమాదానికి గురవగా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాడు. ఇద్దరూ ఆదివారం మృతి చెందారు.