ఆర్థిక ఇబ్బందులతో ఒక వ్యక్తి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తుని టౌన్ ఎస్ఐ విజయబాబు తెలిపారు. తుని టౌన్ పరిధిలోని టైలర్స్ కాలనీకి చెందిన ప్రసాద్ ఈ నెల 6వ తేదీ నుంచి కనిపించడం లేదని అతని భార్య సత్య ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని చెప్పారు.