కొత్తపేట మండలం మోడేకుర్రు బాలగణపతి ఆలయం వద్ద కరెంటు షాక్‌కు గురై రాజోలు మండలం శివకోటిపాలానికి చెందిన మారుతి సుబ్బారావు (45) మృతి చెందాడు. ఎస్ఐ సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. తెరమీద సినిమాలు ప్రదర్శిస్తూ జీవనం సాగించే సుబ్బారావు శనివారం రాత్రి ఆలయం వద్ద సినిమా ప్రదర్శించేందుకు తెరను సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలో తీగలకు సూది పిన్నీసు గుచ్చుతూ షాక్ కు గురై చనిపోయాడన్నారు.