వై.రామవరం మండలానికి చెందిన వివాహిత (55) వైద్య పరీక్షల కోసం ఈ నెల 6వ తేదీన రాజమండ్రిలోని ప్రభుత్వాసుపత్రికి భర్తతో కలిసి వచ్చింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం నుంచి కనిపించడం లేదని భర్త స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.