కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజోలు మండలం శివకోటికి చెందిన సువర్ణరత్నం(39) మృతి చెందినట్లు ఎస్సై రాజేష్ కుమార్ ఆదివారం తెలిపారు. మలికిపురం నుంచి గత నెల 27న బైక్‌పై ఇంటికి వస్తుండగా శివకోటి లాకుల వద్ద అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. అతణ్ని కాకినాడ GGHకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడని తెలిపారు.