తుని పట్టణంలోని ఉప్పరి గూడెం ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై విజయబాబు ఆదివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1300 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. పేకాట, కోడి పందేల వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని ఎస్ఐ హెచ్చరించారు.