ధవళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన వరద ఉద్ధృతి
NEWS Sep 09,2024 05:04 am
ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉద్ధృతి నెమ్మదిస్తోంది. ఆదివారం సాయంత్రానికి బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.20 అడుగులకు చేరింది. సాగునీటి అవసరాల నిమిత్తం 3,300 క్యూసెక్కులు వాడుకొని మిగిలిన 5,21,407 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నామని అధికారులు తెలిపారు.