ప్రజానాట్య మండలిని తీర్చిదిద్ది ప్రజా కళలకు దిక్సూచిగా గరికపాటి రాజారావు నిలిచారని పలువురు కొనియాడారు. ఆదివారం పెద్దాపురంలోని యాసలపు సూర్యారావు భవనంలో ప్రజానాట్య మండలి మండల కార్యదర్శి రొంగల వీర్రాజు అధ్యక్షతన గరికపాటి రాజారావు వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.