పరిశుభ్రతపై సారథి కళాకారుల ప్రదర్శన
NEWS Sep 09,2024 05:08 am
సిరిసిల్ల పట్టణంలోని 22వవార్డు తారకరామనగర్ లో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యములో సాంస్కృతిక సారథి ఎడమల శ్రీధర్ రెడ్డీ కళా బృందం కళాప్రదర్శన నిర్వహించారు. తడి పొడి హాని కలిగించే చెత్తలు వేరు చేసి ఇంటి ముందుకు వచ్చే మున్సిపాలిటీ వాహనానికి అందించాలని ఇంటిలో 3 బుట్టలు వాడుతూ చెత్తలను వేరు చేయాలని ఇంటిలో మనవాడలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్చధనం పచ్చదనం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రాణవాయువును అందించే పచ్చని చెట్లు ప్రతీ ఒక్కరూ ఇంటి ముందు పెంచుకోవాలని వార్డు ప్రజలకు పాటల ద్వారా అవగాహన కల్పించారు.