అహ్మదాబాద్: భారీ వర్షాలతో గుజరాత్లో నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తోన్న ఓ జంట.. వాహనంతో సహా నదిలో కొట్టుకుపోవడం కలవరపరిచింది. కిలో మీటరుకు పైగా దూరం వెళ్లిన ఆ వాహనం ఓ చోట నిలిచి పోయింది. దీంతో కారు పైభాగానికి చేరుకున్న ఆ జంట.. సాయం కోసం 2 గంటలు ఎదురు చూసింది. చివరికి సహాయక బృందాలు వారిని కాపాడాయి.