ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం
NEWS Sep 08,2024 05:37 pm
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో రాబోయే.. వర్షాలు, వరదలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి.. బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని సీఎం చెప్పుకొచ్చారు.