బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి ఎలిమినేషన్‌లో బేబక్క బయటకు వచ్చేసింది. మొదటిరోజే తన వల్ల పప్పు మాడిపోయిందని పలువురు కంటెస్టెంట్స్.. తనపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ముందుగా సోనియా.. ఈ విషయాన్ని పెద్దగా చేసింది. కుక్కర్ పనిచేయడం లేదని గ్రహించక పప్పు మాడిపోయింది అని చెప్పినా వినకుండా బేబక్కపై సీరియస్ అయ్యింది సోనియా. చాలామంది ఇదే కారణంగా తనను నామినేట్ చేశారు. అలా బేబక్క నామినేషన్స్‌లోకి వచ్చింది. బేబక్క వెళ్లిపోతున్నందుకు సీత ఎమోషనల్ అయ్యి ఏడ్చేసింది.