బంగ్లాతో తొలి టెస్టుకు టీమిండియా
NEWS Sep 08,2024 05:10 pm
బంగ్లాదేశ్ తో 2 టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ నెల 19 నుంచి జరిగే తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతారు. దేశవాళీ పోటీల్లో విశేషంగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ కు టీమిండియాలో స్థానం లభించింది. డాషింగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ ఎంపికయ్యాడు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ లకు స్థానం లభించింది. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్ తొలిసారిగా టీమిండియాకు ఎంపిక ఆయ్యాడు. తొలి టెస్టు చెన్నైలో జరగనుండగా, రెండో టెస్టు కాన్పూర్ లో జరగనుంది.