గౌడసంఘం అధ్యక్షునిగా పొన్నం శ్రీనివాస్
NEWS Sep 08,2024 04:29 pm
మల్యాల మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో గౌడ సంఘం సభ్యులు సమావేశం నిర్వహించి, మల్యాల పట్టణ గౌడ సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బండారి దేవరాజ్, ఉపాధ్యక్షులుగా భావు సంతోష్, కరబూజ శ్రీనివాస్, కోశాధికారిగా యాగండ్ల రాజ్, కార్యవర్గ సభ్యులుగా జాగిరి శ్రీనివాస్, గుర్రం అంజనేయులు, పొన్నం పరశురాములు ఎన్నికయ్యారు.